: చిక్కుల్లో మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్... బీసీసీఐ నోటీసులు


భారత జూనియర్ క్రికెట్ జట్టుకు చీఫ్ సెలక్టర్ గా ఉన్న మాజీ పేస్ బౌలర్ వెంకటేశ్ ప్రసాద్ చిక్కుల్లో పడ్డాడు. ఓ క్రికెట్ అకాడమీలో ఆయన భాగస్వామిగా ఉన్నాడన్న కారణంతో 'విరుద్ధ ప్రయోజనాల'పై వివరణ ఇవ్వాలని బీసీసీఐ నోటీసులు జారీ చేసింది. బీసీసీఐ కింద పనిచేసే ఎవరైనా, క్రికెట్ కు సంబంధించిన మరే కార్యక్రమాల ద్వారా ఆదాయాన్ని పొందకూడదన్న నిబంధన ఆధారంగా, అంబుడ్స్ మెన్ జస్టిస్ ఏపీ షా ఈ నోటీసులు పంపగా, ఆ వెంటనే వెంకటేశ్ ప్రసాద్ వివరణ ఇచ్చాడు. తాను 2014లో సహచరుడైన సుజిత్ సోమసుందర్ తో కలసి అకాడమీని ప్రారంభించానని, 2015లో బీసీసీఐతో డీల్ తరువాత ఒక్కనాడు కూడా అకాడమీ శిక్షణా తరగతులకు వెళ్లలేదని వివరించాడు. అయితే, సదరు అకాడమీలో 50 శాతం వాటా ఉన్నట్టు తెలిపాడు. కాగా, ఇలా పార్టనర్ షిప్ సైతం పరస్పర విరుద్ధ ప్రయోజనాల కిందే ఉంటుంది. ఇక సెలక్టర్ పదవి కోసం ప్రసాద్, తన వాటాను వదులుకుంటాడో, లేదో వేచి చూడాలి.

  • Loading...

More Telugu News