: హోంగార్డుల వెట్టిచాకిరీపై విచారణకు ఆదేశం
రంగారెడ్డి జిల్లా ఎస్పీ నవీన్ కుమార్ నివాసంలో హోంగార్డులు వెట్టిచాకిరీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేయడంతో వాటిని టీవీ చానెళ్లు ప్రసారం చేశాయి. దీంతో ఈ వీడియోపై వాస్తవాలు వెలుగు తీయాలని పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తుకు ఆదేశించారు. ఆర్డర్లీ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసినప్పటికీ ఇలాంటి ఘటనలు చోటుచేసుకోవడం దురదృష్టకరమని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలుసుకుని చర్యలు తీసుకుంటామని ఇన్ ఛార్జ్ డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. అయితే ఆర్డర్లీ వ్యవస్థను అధికారికంగా రద్దు చేసినప్పటికీ, హోంగార్డు ఉద్యోగాలకు భద్రత లేకపోవడంతో అధికారుల ఇళ్లలో పని చేయడం సర్వసాధారణమని హోంగార్డు సంక్షేమ సంఘం నేత తెలిపారు.