: బహిరంగ చర్చకు నేను రెడీ: బీజేపీ సవాల్ ను స్వీకరించిన ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి


బీజేపీ విసిరిన సవాల్ ను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి హరీష్ రావత్ స్వీకరించారు. ఉత్తరాఖండ్ రాజకీయ సంక్షోభం సందర్భంగా జరిగిన స్టింగ్ ఆపరేషన్ వీడియో గురించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అజయ్ భట్ మాట్లాడుతూ, రావత్ కు నైతిక విలువలు ఉంటే బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీంతో అజయ్ భట్ విసిరిన సవాలు స్వీకరిస్తున్నానని, బహిరంగ చర్చకు తాను సిద్ధమేనని హరీష్‌ రావత్‌ ప్రకటించారు. కాగా, ఇప్పటికే దీనిపై సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. రావత్‌ ఇటీవల తన ఇంటి వద్ద ‘జనసంవాద్‌’ కార్యక్రమంలో భాగంగా సమావేశమైన ప్రజలతో స్టింగ్‌ ఆపరేషన్‌ గురించి వివరణ ఇచ్చారు. దీంతో బీజేపీ సవాలు విసిరింది.

  • Loading...

More Telugu News