: జకీర్ నాయక్ కు అనవసర ప్రచారం...అతని మేధస్సు ఏపాటిదో తెలుసా?


బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరిగిన ఉగ్రవాద విధ్వంసంతో దేశవ్యాప్తంగా మార్మోగిపోతున్న పేరు జకీర్ నాయక్. ముస్లిం మతగురువైన జకీర్ నాయక్ ప్రసంగాలు యువకులను ఉగ్రవాదులుగా మార్చేసేంత పదునైన ప్రసంగాలా? అంటే పలువురు ముస్లిం మత పెద్దలు ఆశ్చర్యపోతున్నారు. జకీర్ నాయక్ కు అనవసర ప్రచారం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆయనకు వాక్పటిమ ఉందని చెబుతున్న కొంతమంది, ఆయనలో విషయం మాత్రం లేదని అంటున్నారు. ఆయన హాఫ్ నాలెడ్జ్ తో చేసే ప్రసంగాలు ఆకట్టుకుంటాయి కానీ, వాటిలో వాస్తవాలు ఉండవని వారు పేర్కొంటున్నారు. గతంలో ఆయన మాట్లాడిన ప్రసంగాల టేపులను కొన్నింటిని ప్రసంగాలను గమనించగా, అందులో చాలా తప్పులు ఉన్నాయంటున్నారు. ఇస్లామిక్ రీసెర్చ్ స్కాలర్ నని, మెడిసిన్ చదివానని చెప్పుకునే జకీర్ నాయక్ కు డార్విన్ థియరీ గురించి కూడా తెలియదంటే నమ్మగలరా? నమ్మినా నమ్మకున్నా ఆయనకు డార్విన్ థియరీ గురించి అవగాహన లేదు. దీనిపై ఓ ప్రసంగంలో ఆయన మాట్లాడుతూ, ‘హోమో సెపియన్స్’ ఐదు లక్షల ఏళ్ల క్రితమే భూమిపైన అంతరించిపోయాయని అన్నారు. హోమో సెపియన్స్ అనే పదం లాటిన్ భాష నుంచి వచ్చింది. హోమో అంటే మనిషి అని అర్థం. సోపియన్స్ అంటే జాతి లేదా ఉపజాతి. హోమో సెపియన్స్ అన్న మొత్తం పదానికి మానవ జాతి అని అర్థం. స్వీడన్‌కు చెందిన ప్రముఖ వృక్ష, జంతు, భౌతిక శాస్త్రవేత్త కార్ల్ లిన్నాయిస్ 1758లో ఈ పదాన్ని ఖరారు చేశారు. సైన్స్ చదవకున్నప్పటికీ ప్రతి విద్యార్థికీ ఇది తెలిసిందే! అయితే మెడిసిన్ చదివి, స్కాలర్ నని చెప్పుకునే జకీర్ నాయక్‌ కు ఇది తెలియకపోవడం చిత్రమే మరి. అలాగే ఆయన ఈక్వెడార్ ప్రాంతంలోని గాలపాగోస్ దీవులను కెలోట్రపస్ (జిల్లేడు మొక్కలు) దీవులని చెబుతారని వారు పేర్కొంటున్నారు. ఇలాంటి పదాలు ఆయన ప్రసంగాల్లో ఎన్నో ఉన్నాయని, ఆర్ఎస్ఎస్ లాంటి హిందూ సంస్థలు గోరంతలు కొడంతలు చేసి, రాజకీయ ప్రయోజనాల కోసం అతనిని హీరోను చేస్తే, అతని ప్రసంగాలు వీక్షించేవారు భారత్ లో కూడా తయారవుతారని పలువురు హెచ్చరిస్తున్నారు. జకీర్ నాయక్ తో సైద్ధాంతికంగా పోరాడి ప్రజల్లో ఆయన ఆనవాళ్లను తుడిచేయడమే ఉత్తమమైన మార్గమని, జకీర్ నాయక్‌ ను సైద్ధాంతికంగా ఎదుర్కోవడం చాలా సులభమని వారు చెబుతున్నారు. చిన్న ముల్లును కూడా పెద్ద పిన్నీసుతో జాగ్రత్తగా తీయాలని వారు సూచిస్తున్నారు.

  • Loading...

More Telugu News