: పంజాగుట్టలో దొరికిన దొంగ.. 13 ల్యాప్ట్యాప్లు, 14 సెల్ఫోన్లు, 4.5 తులాల బంగారం స్వాధీనం!
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో జరిగిన చోరీల్లో కేసును దర్యాప్తు చేస్తోన్న పోలీసులకి ఈరోజు ఓ దొంగ దొరికాడు. అతని వద్ద నుంచి పలు విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దొంగనుంచి పోలీసులు 13 ల్యాప్ట్యాప్లు, ఐప్యాడ్, 14 సెల్ఫోన్లు, 4.5 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు అతనిని పోలీస్ స్టేషన్కి తరలించారు. అరెస్టయిన వ్యక్తి ఒక్కడే ఈ దొంగతనాలకు పాల్పడ్డాడా..? లేక ఇతనితో పాటు మరెవరైనా వున్నారా? అనే విషయంపై ఆరా తీస్తున్నారు.