: కుటుంబ పాలన వ్యాఖ్యలపై ఆగ్రహం.. దిగ్విజయ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని తెలంగాణ న్యాయవాదుల ఫిర్యాదు
తెలంగాణలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఇటీవల చేసిన వ్యాఖ్యల పట్ల తెలంగాణ న్యాయవాదులు అభ్యంతరం తెలిపారు. ఈ అంశంపై ఈరోజు మధ్యాహ్నం హైదరాబాదు, బేగంబజార్ పోలీసులకి న్యాయవాదులు ఫిర్యాదు చేశారు. తెలంగాణ రాష్ట్రం కుటుంబ పాలనలో ఉందంటూ కేసీఆర్ పై దిగ్విజయ్ సింగ్ పలు వ్యాఖ్యలు చేశారని, దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని వారు పోలీసులని కోరారు. దిగ్విజయ్ సింగ్‌తో పాటు రాష్ట్ర కాంగ్రెస్ ముఖ్య నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డిలపై కూడా చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు తమ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు.