: లేటెస్ట్ ట్రెండ్... పులులే డిజైనర్లు...టైగర్స్ తయారు చేసే జూ జీన్స్!


ఈవేళ ఫ్యాషన్ కొత్త పుంతలు తొక్కుతోంది. విదేశాల్లోని వారు వేసుకునే జీన్స్ ప్యాంట్ కి ఎన్ని చిరుగులు వుంటే అంత ఫ్యాషన్... ఈ ట్రెండ్ కి తగ్గట్టు అక్కడ 'జూ జీన్స్' అనే సంస్థ సరికొత్త డిజైనర్లతో జీన్స్ తయారు చేయిస్తోంది. ఇక్కడ అసలు విశేషం ఏమిటంటే, ఆ డిజైనర్లు పులులు కావడం! జపాన్ లోని హిటాచీలో 'కామినే' పేరిట ఓ జూ వుంది. అక్కడ వీటిని తయారుచేస్తున్నారు. సంస్థ ముందుగా తయారు చేసిన జీన్స్ ను ఫుట్ బాల్, టైర్ వంటి వాటికి చుట్టి పులులు తిరిగే బోనుల్లో వదిలేస్తారు. తర్వాత వాటిని పట్టుకుని పులులు అక్కడక్కడ పంటిగాట్లు, గోరు గాట్లతో ఈ జీన్స్ కు చిల్లులు పెడతాయి. వాటిని తీసుకుని మరమ్మతులు చేసి, ఆ పులులు చేసిన గాట్లు, గీకుళ్లు తొడభాగంలో వచ్చేలా కుడతారు. వీటిని 'జూ జీన్స్' బ్రాండ్ గా షాపింగ్ మాల్స్ లో విక్రయిస్తున్నారు. వీటికి జపాన్ లో మంచి ఆదరణ ఉందని ఈ బ్రాండ్ యజమానులు తెలిపారు.

  • Loading...

More Telugu News