: దక్షిణాఫ్రికా అధ్యక్షుడితో కలిసి రైలులో ప్రయాణించిన మోదీ
నాలుగు ఆఫ్రికా దేశాల పర్యటనలో భాగంగా ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో ఉన్న భారత ప్రధాని మోదీ ఈరోజు ఆ దేశంలోని డర్బన్‌లో పర్యటిస్తున్నారు. దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమాతో కలిసి మోదీ ఈరోజు రైలులో ప్రయాణించారు. డర్బన్ నగరంలోని పెంట్రిచ్ రైల్వే స్టేషన్ నుంచి పీటర్ మారిట్‌బర్గ్‌కు మోదీ ప్రయాణించారు. 1893లో పీటర్ మారిట్‌బర్గ్ రైల్వే స్టేషన్‌లో గాంధీజీకి అవమానం జరిగిన సంగతి తెలిసిందే. ఫస్ట్ క్లాస్ కంపార్ట్ మెంట్లో ప్రయాణిస్తున్న గాంధీని 'నల్ల జాతీయుడవి, ఇందులో ఎందుకు ఎక్కావ్?' అంటూ రైలులో నుంచి ఆనాడు తోసేశారు. కాగా, దక్షిణాఫ్రికాతో నరేంద్ర మోదీ నాలుగు కీలక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. తన పర్యటనలో భాగంగా ఈరోజు సాయంత్రం మోదీ దక్షిణాఫ్రికా నుంచి టాంజానియాకు బయలుదేరనున్నారు.