: తిరుపతి జువైనల్ హోం నుంచి నలుగురు బాలల పరారీ
తిరుపతి జువైనల్ హోం నుంచి నలుగురు బాల ఖైదీలు పరారయ్యారు. అంతవరకూ బంధువులతో మాట్లాడిన బాల ఖైదీలు వారు అటు వెళ్లగానే, దుప్పట్లు ఆరేస్తామనే వంకతో అడ్డం వచ్చిన అధికారులను తోసుకుని బయటకు వెళ్లిపోయారు. వారిని పట్టుకునేందుకు యత్నించిన సిబ్బందిపై దాడికి పాల్పడిన ఆ నలుగురు పరారైనట్టు అధికారులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు జువైనల్ హోం అధికారులు తెలిపారు. పరారైన నలుగురు బాల ఖైదీలు చిత్తూరు జిల్లాకు చెందిన వారేనని వారు వెల్లడించారు. సిబ్బంది కొరత కారణంగా ఇలాంటి ఘటన చోటుచేసుకున్నట్టు అధికారులు తెలిపారు.