: వ్యాపారవేత్తగా సన్నీ లియోన్!.... సొంత ఫెర్ ప్యూమ్ ను విడుదల చేసిన స్టార్!
తనదైన శైలిలో అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు హుషారెత్తిస్తున్న బాలీవుడ్ స్టార్ సన్నీ లియోన్ వ్యాపారవేత్త అవతారం ఎత్తింది. సిల్వర్ స్క్రీన్ పై ఓ వెలుగు వెలుగుతున్న ఈ సెక్సీ స్టార్ తాజాగా సింగర్ గానూ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా తన అందచందాలతోనే కాకుండా కుర్రకారును తన ఫెర్ ప్యూమ్ తోనూ చిత్తు చేసేందుకు రంగంలోకి దిగింది. కొత్తగా ఓ ఫెర్ ప్యూమ్ బ్రాండ్ ను విడుదల చేసిన ఈ స్టార్ హీరోయిన్ దానికి కిర్రెక్కించేలా ‘లస్ట్’ అని పేరు కూడా పెట్టేసి మార్కెట్లోకి రిలీజ్ చేసింది. మరి ఈ ‘లస్ట్’ ఏ మేర కుర్రకారును ఆకట్టుకుంటుందో చూడాలి.