: గంగూలీని అత్యుత్తమ కెప్టెన్ గా అభివర్ణించిన భజ్జీ!... స్పిన్నర్ హర్భజన్ ఆఫీసుపై దాడి చేసిన ధోనీ ఫ్యాన్స్!
టీమిండియా కెప్టెన్లలో అత్యుత్తమ రథ సారధి ఎవరు? అన్న ప్రశ్నకు మన దేశంలో చాలా పేర్లే వినిపిస్తాయి. ఎందుకంటే... పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అన్నట్టు... టీమిండియాకు కెప్టెన్లుగా వ్యవహరించిన అందరు కెప్టెన్లకూ అభిమానులున్నారు. అయితే విజయాల పరంగానే కాకుండా, ఐసీపీ ప్రపంచ కప్ లను సాధించిన విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే కెప్టెన్ కూల్ మహేంద్ర సింగ్ ధోనీనే అందరిలోకి బెస్ట్ కెప్టెన్. ఇదే ధోనీకి ఉన్న అశేష ఫ్యాన్స్ భావన. అయితే నిన్న టీమిండియా కెప్టెన్ గా తనదైన శైలిలో రాణించి ప్రశంసలు అందుకున్న సౌరవ్ గంగూలి జన్మదినాన్ని పురస్కరించుకుని స్పిన్నర్ హర్భజన్ సింగ్ అతడిని టీమిండియా కెప్టెన్లలో అత్యుత్తమ కెప్టెన్ గా అభివర్ణించాడు. దీనిపై కెప్టెన్ కూల్... కూల్ గానే ఉన్నా అతడి అభిమానులు మాత్రం దానిని జీర్ణించుకోలేకపోయారు. సహనం ఉన్న కొందరు భజ్జీ కామెంట్ పై సోషల్ మీడియాలో సెటైర్లు సంధిస్తే... కాస్తంత క్షణికావేశంతో ఊగిపోయిన కెప్టెన్ కూల్ ఫ్యాన్స్ భజ్జీ కార్యాలయంపై దాడికి దిగారు.