: ఉత్తరప్రదేశ్‌లో అక్రమ కట్టడాల కూల్చివేతలో విషాదం... నలుగురి మృతి... ఉద్రిక్తత
ఉత్తరప్రదేశ్‌లో ఈరోజు విషాదం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని మీరట్‌లో అక్రమ కట్టడాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అధికారులు ఈరోజు వాటిని కూల్చివేయాలని నిర్ణయించుకొని పనులు మొదలుపెట్టారు. అయితే కూల్చివేత సమయంలో శిథిలాల కింద చిక్కుకొని నలుగురు మృతి చెందారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఘటన జరిగిన వెంటనే 42 మందితో కూడిన ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అక్కడకు చేరుకుంది. మృతదేహాలను బయటకు తీసే ప్రయత్నం చేస్తోంది. ఆందోళనకు దిగిన స్థానికులను ఎన్డీఆర్ఎఫ్ టీమ్ అదుపుచేసే ప్రయత్నం చేస్తోంది