: ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఘనంగా బోనాల సంబురాలు
ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఈరోజు బోనాల సంబురాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైదరాబాద్ లాల్‌దర్వాజా గుడి నిర్వాహకుల ఆధ్వర్యంలో సంబురాలు జరుగుతున్నాయి. ఈరోజు ప్రభుత్వాధికారులు ఉగ్గుడోలు బోనాల ఘట్టం నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేతలు కూడా ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బోనాల్లో పోతురాజుల నృత్యం అలరించింది. ఘనంగా అమ్మవారి ఊరేగింపు జరుపుతున్నారు. బోనాల సందర్భంగా అక్కడ కావలసిన ఏర్పాట్లన్నిటినీ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీంతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంది.