: చిత్తూరు జిల్లా వి.కోట ప్రభుత్వ వైద్యశాలపై రోగుల దాడి
ప్రభుత్వ వైద్యులపై వారికి ఆగ్రహం వచ్చింది. అనారోగ్యంతో బాధలు పడుతూ అతికష్టం మీద వైద్యశాలకు వస్తోంటే, తీరా అక్కడ వైద్యులు కనపడడం లేదు. దీంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లలేక, వ్యాధితో బాధపడలేక నానా అవస్థలు పడుతోన్న రోగుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీంతో ప్రభుత్వ వైద్యశాలపై దాడికి దిగారు. ఈ ఘటన ఈరోజు ఉదయం చిత్తూరు జిల్లా వి.కోట ప్రభుత్వ వైద్యశాలలో చోటు చేసుకుంది. వైద్యులు విధులకు సరిగా రావట్లేదని రోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైద్యశాలలో ఫర్నీచర్, అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో అక్కడ ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ ప్రాంతంలో పేరుకి వైద్యశాల ఉన్నప్పటికీ దాని సేవలు మాత్రం సమయానికి అందడం లేదని వారు వాపోతున్నారు.