: టీడీపీకి షాక్!... వైఎస్ జయంతి వేడుకల్లో ‘జంపింగ్’ ఎమ్మెల్సీ!


ఏపీలో మారిన రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ కుటుంబానికి మూడున్నర దశాబ్దాలుగా భక్తుడిగా ఉన్న ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి ఇటీవలే టీడీపీలో చేరిపోయారు. జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో పాటు ఆయనకు దగ్గరి బంధువైన దేవగుడి కూడా విజయవాడకు వెళ్లి మరీ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే నిన్న వైఎస్ జయంతి వేడుకల సందర్భంగా కడప జిల్లాలో ఓ సంచలన ఘటన చోటుచేసుకుంది. యావత్తు టీడీపీ శ్రేణులను ఆశ్చర్యానికి గురి చేసిన ఆ ఘటనలో దేవగుడి నారాయణరెడ్డి తన సొంతూరు దేవగుడిలో వైఎస్ విగ్రహానికి ఘన నివాళి అర్పించారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఆ సమయంలో అదే ఊరిలోని తన సొంతింటిలో ఉండగానే... దేవగుడి వైఎస్ కు నివాళి అర్పించారు. గతంలో వైసీపీలో ఉన్న సమయంలో మాదిరిగానే నిన్నటి కార్యక్రమంలో దేవగుడి వైఎస్ కు ఘన నివాళి అర్పించారు. ఈ విషయంపై కడప జిల్లాలోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా టీడీపీ శ్రేణులు పెద్ద ఎత్తున చర్చించుకుంటున్నాయి.

  • Loading...

More Telugu News