: ఇసుక తరలింపులో అక్రమాలను నిరోధించాలి: హరీశ్‌రావు, కేటీఆర్
హైదరాబాద్‌లోని తెలంగాణ సచివాలయంలో రాష్ట్ర సాగునీటి, గనుల శాఖ అధికారులతో మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ ఈరోజు భేటీ అయ్యారు. రెండు శాఖల్లోని పలు కీలక అంశాలపై చర్చిస్తున్నారు. అధికారులు సమర్థవంతంగా పనిచేయాలని, అక్రమంగా ఇసుకను తరలిస్తోన్న వారి పట్ల దృష్టి పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రులు అధికారులకు సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక రీచ్‌లను గుర్తించాలని అధికారులను ఆదేశించారు. పనుల్లో ఎటువంటి అవకతవకలు జరగకుండా చర్యలు తీసుకోవాలని వారు సూచించారు. సాగునీటి ప్రాజెక్టులకు అవసరమైన ఇసుక సేకరణ పనులను చేపట్టాలని ఆదేశించారు.