: మాట మరువని నారా లోకేశ్!... టీ టీడీపీ నేతలతో ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో కీలక భేటీ!
తెలుగు రాష్ట్రాల్లోని ఏపీలో టీడీపీ అధికారం చేపట్టింది. తెలంగాణలో నానాటికీ క్షీణిస్తోంది. అయితే క్రమంగా బలహీనపడుతున్న ప్రాంతంలో పార్టీని తిరిగి పురోభివృద్ధి భాట పట్టిస్తానని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇటీవలే ప్రకటించారు. ఏపీలో పార్టీని తిరుగులేని శక్తిగా మలిచే విషయంపై దృష్టి సారిస్తూనే తెలంగాణ శాఖపైనా శ్రద్ధ తీసుకుంటానని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగా వారంలో ప్రతి శనివారం హైదరాబాదులోని పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో టీ టీడీపీ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని, పార్టీ నేతలతో సమావేశమవుతానని ఆయన పేర్కొన్నారు. ఇచ్చిన మాట మరువని నారా లోకేశ్ నిన్న రాత్రే విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చేశారు. కొద్దిసేపటి క్రితం ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ కు వచ్చిన ఆయన టీ టీడీపీ నేతలతో కీలక సమావేశాన్ని ప్రారంభించారు.