: విదేశీ పర్యటనకు హెల్త్ వర్సిటీ వీసీ రవిరాజు... తాత్కాలిక వీసీగా సుబ్బారావు నియామకం


విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీకి తాత్కాలిక ఉప కులపతిగా డాక్టర్ సుబ్బారావు నియమితులయ్యారు. ఈ మేరకు నిన్న ఏపీ సర్కారు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం వర్సిటీకి వీసీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ప్రొఫెసర్ టి.రవిరాజు ఈ నెల 1 నుంచి 19 వరకు విదేశీ పర్యటనలో వుంటున్నారు. వైద్య విద్యా బోధన, ప్రవేశాలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే ఈ వర్సిటీ వీసీ లేకుండా కార్యకలాపాలు కొనసాగించడం దుర్లభం. ఈ కారణంగానే రవిరాజు విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చేదాకా సుబ్బారావును తాత్కాలిక వీసీగా నియమిస్తూ ఏపీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

  • Loading...

More Telugu News