: కేబినెట్ భేటీకి రాలేకపోయిన నలుగురు ఏపీ మంత్రులు!


నవ్యాంధ్ర పొలిటికల్ కేపిటల్ విజయవాడలో సీఎం నారా చంద్రబాబునాయుడు అధ్యక్షతన నిన్న కేబినెట్ భేటీ జరిగింది. పలు కీలక నిర్ణయాలు తీసుకున్న ఈ కేబినెట్ భేటీకి ఏకంగా నలుగురు కీలక మంత్రులు డుమ్మా కొట్టేశారు. మంత్రివర్గ సమావేశానికి గైర్హాజరైన వారిలో పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి పైడికొండల మాణిక్యాల రావు ఉన్నారు. కేబినెట్ భేటీకి గైర్హాజరవుతున్న కారణాలను వారు ముందుగానే చంద్రబాబుకు వివరించి, ఆయన అనుమతి మేరకే భేటీకి రాలేదని సమాచారం.

  • Loading...

More Telugu News