: శంషాబాదులో నిలిచిన స్పైస్ జెట్ ఫ్లైట్!... 4 గంటలుగా ప్రయాణికుల పడిగాపులు!


దేశీయ ప్రైవేటు విమానయాన సంస్థలు ప్రయాణికులను ముప్పు తిప్పలు పెడుతున్నాయి. నిత్యం సాంకేతిక లోపాలు తలెత్తుతున్న కారణంగా దేశవ్యాప్తంగా పలు ఎయిర్ పోర్టుల్లో ఆయా సంస్థలకు చెందిన విమానాలు గంటల తరబడి నిలిచిపోతున్నాయి. ఈ క్రమంలో వేలాది రూపాయలు పెట్టి టికెట్లు కొనుగోలు చేసి లగేజీతో నిర్ణీత సమయానికే ఎయిర్ పోర్టుకు చేరుకుంటున్న ప్యాసింజర్లకు గంటల తరబడి వెయిటింగ్ తప్పడం లేదు. హైదరాబాదు శివారులోని శంషాబాదు అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేటి తెల్లవారుజామున ముంబై బయలుదేరి వెళ్లాల్సిన స్పైస్ జెట్ ఎయిర్ వేస్ కు చెందిన విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో ఆ విమానం టేకాఫ్ తీసుకోలేకపోయింది. ఈ విమానంలో ముంబై వెళ్లేందుకు సిద్ధపడి వచ్చిన ప్రయాణికులకు వెయిటింగ్ తప్పలేదు. సాంకేతిక లోపాన్ని సరిచేసే పనిని ఆ సంస్థ సిబ్బంది చేపట్టలేదు. అంతేకాకుండా ప్యాసింజర్లకు వారు సరైన సమాధానం కూడా ఇవ్వడం లేదు. దీంతో ఆగ్రహావేశాలు వ్యక్తం చేసిన ప్రయాణికులు 4 గంటల వెయిటింగ్ తర్వాత ఎయిర్ పోర్టులో ఆందోళనకు దిగారు.

  • Loading...

More Telugu News