: చంద్రబాబు రష్యా టూర్ షురూ!... ఢిల్లీ మీదుగా బయలుదేరిన ఏపీ సీఎం!
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు రష్యా పర్యటనకు బయలుదేరారు. కొద్దిసేపటి క్రితం విజయవాడ సమీపంలోని గన్నవరం ఎయిర్ పోర్టులో ఢిల్లీ ఫ్లైటెక్కిన చంద్రబాబు మరికాసేపట్లో ఢిల్లీ చేరుకోనున్నారు. ఆ తర్వాత అక్కడి విమానాశ్రయంలో ఆయన రష్యా విమానం ఎక్కుతారు. తన పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ సూచన మేరకు చంద్రబాబు తొలుత కజకిస్థాన్ రాజధాని అస్తానాలో దిగుతారు. అక్కడి అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలను ఆయన పరిశీలిస్తారు. నవ్యాంధ్ర నూతన రాజధాని అమరావతి నిర్మాణం నేపథ్యంలో అస్తానాలో పర్యటించాలని మోదీ సూచించారట. అస్తానాలో పర్యటన ముగించుకున్న తర్వాత ఆయన రష్యా నగరం ఎకటెరిన్ బర్గ్ చేరుకుంటారు. తిరిగి ఈ నెల 13న ఆయన తిరుగుపయనమవుతారు.