: దేశీయ విమానయానాల్లో రాజ్ నాథ్ వెంట సాయుధ సెక్యూరిటీ గార్డు!
కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ కేంద్ర కేబినెట్ లో కీలక స్థానంలో ఉన్నారు. ప్రస్తుతం దేశీయ విమానయానాల్లో ఓ సెక్యూరిటీ గార్డు నిత్యం ఆయన వెన్నంటే ఉంటాడు. అయితే సదరు సెక్యూరిటీ గార్డు చేతిలో ఎలాంటి ఆయుధం ఉండదు. పౌర విమానయాన శాఖ నిర్దేశాలతోనే సదరు సెక్యూరిటీ గార్డు ఆయుధాన్ని వెంట తీసుకెళ్లేందుకు అనుమతి లేదు. అయితే రాజ్ నాథ్ కు పలు వర్గాల నుంచి ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ పౌర విమానయాన శాఖకు ఇటీవల ఓ లేఖ రాసింది. భద్రతా కారణాల రీత్యా విమానయానాల్లో రాజ్ నాథ్ వెంట వెళ్లే సెక్యూరిటీ గార్డు ఆయుధం వెంట తీసుకెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఆ లేఖలో కోరింది. హోం శాఖ వినతికి పౌర విమానయాన శాఖ కూడా ఆమోదం తెలిపింది.