: మోదీ కేబినెట్ లో 31 శాతం మంత్రులు నేర చరితులే!... వారంతా కోటీశ్వరులేనట!
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మొన్న తన కేబినెట్ లో మరో 19 మందిని చేర్చుకుని మొత్తం మంత్రుల సంఖ్యను 78కి పెంచుకున్నారు. ఈ 78 మందిలో 24 మంది (31 శాతం) మంది నేర చరితులేనట. ఈ మేరకు ప్రముఖ ఆంగ్ల దినపత్రిక ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ ఓ ఆసక్తికర కథనాన్ని రాసింది. ఈ ‘నేరచరిత’ మంత్రుల్లో 14 మందిపై అత్యాచారం, హత్యాయత్నం, సామాజిక అల్లర్లు, ఎన్నికల నియమావళి ఉల్లంఘన తదితర తీవ్ర నేరాలకు సంబంధించిన కేసులు వివిధ కోర్టులలో పెండింగ్ లోనే ఉన్నాయట. ఇక ఇలా నేరచరితులుగా వినుతికెక్కిన ఈ మంత్రులంతా కోటీశ్వరులేనని కూడా ఆ కథనం పేర్కొంది.