: మోహన్‌దాస్‌ను ‘మహాత్మా’గా మార్చింది దక్షిణాఫ్రికానే: ప్రధాని మోదీ
మోహన్‌దాస్ కరమ్ చంద్ గాంధీని మహాత్మాగా మార్చిన దేశం దక్షిణాఫ్రికాయేనని ప్రధాని నరేంద్రమోదీ కొనియాడారు. దక్షిణాఫ్రికా పర్యటనలో ఉన్న ఆయన శుక్రవారం జోహన్నెస్‌బర్గ్‌లో భారతీయులను ఉద్దేశించి మాట్లాడారు. శాంతిదూత నెల్సన్ మండేలాకు దక్షిణాఫ్రికా జన్మభూమి అయితే, మహాత్మాగాంధీకి కర్మభూమి అని అన్నారు. ఇంకా తన ప్రసంగంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మాట్లాడారు. రెండు దేశాలూ ఇంచుమించు ఒకే తరహా సవాళ్లు ఎదుర్కొంటున్నాయని పేర్కొన్నారు. వాటిని ఇద్దరం కలిసి పరిష్కరించుకోవాల్సి ఉందన్నారు. వాణిజ్యరంగంలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ప్రపంచ ఆర్థిక శక్తిగా ఎదుగుతున్న భారత్ అవకాశాల గని అని అభివర్ణించారు.