: భద్రతా దళాల కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ హతం


జమ్మూకాశ్మీర్ లో ఉగ్రవాదులకు గట్టి షాక్ తగిలింది. భారత్ లో దాడులే లక్ష్యంగా పురుడు పోసుకున్న ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ కమాండర్ బుర్హాన్ ముజఫర్ (22) భద్రతా బలగాల కాల్పుల్లో మృతి చెందాడు. కాశ్మీర్ కు చెందిన బుర్హాన్, ఓ స్కూలు ప్రధానోపాధ్యాయుడి కుమారుడు కావడం విశేషం. తీవ్రవాద కార్యకలాపాలు, శ్రీనగర్ లో భద్రతా దళాలపై నిరసనలు, ఆందోళనల సమయంలో దాడులకు పలు సందర్భాల్లో బుర్హాన్ కీలకంగా వ్యవహరించేవాడని తెలుస్తోంది. సోషల్ మీడియాను లక్ష్యంగా చేసుకుని యువతను రెచ్చగొట్టడంలో ఇతడు సిద్ధహస్తుడని అంటారు. సరిహద్దుల్లోని అనంత్ నాగ్ వద్ద జరిగిన ఎన్‌ కౌంటర్ లో బుర్హాన్‌ తో పాటు మరో ఇద్దరు ఉగ్రవాదులను ఆర్మీ హతమార్చింది. సోషల్ మీడియా వేదికగా ముస్లిం యువతను ఉగ్రవాదం వైపు మరలేలా బుర్హాన్ ప్రోత్సహించాడు.

  • Loading...

More Telugu News