: మోదీ మంత్రి వర్గం... కోటీశ్వరులకు నిలయం


కేంద్ర మంత్రి వర్గాన్ని ఇటీవల విస్తరించడం..19 మందిని కొత్తగా చేర్చుకోవడం... ఐదుగురికి ఉద్వాసన పలకడం తెలిసిన విషయమే. దీంతో మొత్తం కేంద్ర మంత్రుల సంఖ్య 78కి చేరింది. అయితే, ఈ కేబినెట్ కోటీశ్వరులకు నిలయంగా మారింది. ఎందుకంటే, 72 మంది మంత్రులు కోటీశ్వరులే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీకి అందరికంటే ఎక్కువగా రూ.113 కోట్ల ఆస్తిని కలిగి ఉండగా, ఆ తర్వాతి స్థానాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి హర్ స్మిత్ కౌర్ బాదల్ రూ.108 కోట్లు, విద్యుత్ శాఖ మంత్రి పీయూష్ గోయల్ రూ.95 కోట్ల ఆస్తి కలిగి ఉన్నారు. ఇక కొత్తగా మంత్రివర్గంలోకి వచ్చిన వారిలో... మధ్యప్రదేశ్ కు చెందిన ఎంపీ, ఎంజే అక్బర్ రూ.44.90 కోట్లు, రాజస్థాన్ కు చెందిన ఎంపీలు పీపీ చౌదరి రూ.35.35 కోట్లు, విజయ్ గోయల్ రూ.29.97 కోట్లు ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు. కోటి కన్నా తక్కువ ఆస్తులు ఉన్న కేంద్రమంత్రులు ఆరుగురు కాగా, వారిలో మధ్యప్రదేశ్ కు చెందిన ఎంపీ అనిల్ మాధవ్ దవేకు అందరికంటే తక్కువగా రూ.60.97 లక్షల ఆస్తి ఉన్నట్లు ప్రకటించారు.

  • Loading...

More Telugu News