: చంద్రబాబూ... కుప్పంలో మీ జెండా వాలిపోకుండా చూసుకోండి: కాంగ్రెస్ నేత తులసిరెడ్డి


వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కడప జిల్లా పులివెందులలో టీడీపీ జెండా ఎగరాలన్న సీఎం చంద్రబాబు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేత, ఏపీ పీసీసీ అధికార ప్రతినిధి తులసిరెడ్డి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పులివెందులలో టీడీపీ జెండా ఎగురవేయడం దేవుడెరుగు, కుప్పంలో మీ జెండా వాలిపోకుండా చూసుకోవాలని చంద్రబాబుకు సూచించారు. టీడీపీ ప్రభుత్వంపై 80 శాతం మంది ప్రజలు సంతృప్తితో ఉన్నారంటూ బాబు చేయించిన సర్వేలో తేలడం విడ్డూరంగా ఉందన్నారు. బాబు ప్రభుత్వంపై ప్రజలు అసంతృప్తితో ఉన్న కారణంగానే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం లేదని తులసిరెడ్డి విమర్శించారు.

  • Loading...

More Telugu News