: విమర్శలు చేసుకోకండి... సమస్య వస్తే సీఎంను సంప్రదించండి: అమిత్ షా సూచన


ఢిల్లీలో ఏపీ బీజేపీ కోర్ కమిటీతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా సమావేశం ముగిసింది. అనంతరం అమిత్ షా మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రభుత్వంలో భాగస్వాములుగా ఉండి పరస్పర విమర్శలు చేసుకోవడం సరికాదని హితవు పలికారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే పరస్పర సహకారం ద్వారా పరిష్కరించుకోవాలని దిశానిర్దేశం చేశారు. ఇంకా సమస్యలుంటే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు. ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చర్యలు చేపట్టాలని ఆయన పార్టీ శ్రేణులను ఆదేశించారు. ఇదే విషయాన్ని టీడీపీ అధిష్ఠానానికి చెబుతామని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News