: సూపర్ స్టార్ రజనీకాంత్ భార్యకు సుప్రీంకోర్టు నోటీసులు
‘కొచ్చాడయాన్’ చిత్రం హక్కుల వివాదానికి సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య లతా రజనీకాంత్ కు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. దీనిపై స్పందించాలని ఆ నోటీసుల్లో కోరినట్లు సమాచారం. ‘కొచ్చాడయాన్’ చిత్రానికి రజనీ కూతురు సౌందర్య దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం హక్కులను లత అక్రమంగా విక్రయించారంటూ యాడ్ బ్యూరో అడ్వర్టైజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేసింది. కొన్ని పత్రాలను లతా రజనీకాంత్ ఫోర్జరీ చేశారంటూ సదరు సంస్థ జూన్ 9, 2015న పోలీసులకు చేసిన ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ దాఖలైంది. ‘కొచ్చాడయాన్’ హక్కులకు సంబంధించిన నకిలీ పత్రాలను కోర్టులో సమర్పించి సినిమా హక్కులను ఒక ఎంటర్ టైన్ మెంట్ కంపెనీకి ఆమె అమ్మారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.