: హైదరాబాదులో మరో ఐఎస్ఐఎస్ సానుభూతి పరుడి అరెస్టు
హైదరాబాదులో మరోసారి ఉగ్రకలకలం రేగింది. ఈ మధ్యే ఐదుగురు ఐఎస్ఐఎస్ అనుమానిత ఉగ్రవాదులను అరెస్టు చేసిన ఎన్ఐఏ అధికారులు, వారిని కస్టడీకి తీసుకున్న సంగతి తెలిసిందే. వారిని విచారిస్తున్న అధికారులు పలు కీలక అంశాలు వారి నుంచి సేకరిస్తున్నారు. ఇందులో భాగంగా సంతోష్ నగర్ లో మరో ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడిని అదుపులోకి తీసుకున్నారు. మాదన్నపేట పోలీసుల సహకారంతో నిజాముద్దీన్ అనే వ్యక్తిని ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఈద్ బజార్ కు చెందిన నిజాముద్దీన్ ను ఎన్‌ఐఏ కార్యాలయానికి తరలించి విచారణ చేపట్టారు.