: హైద‌రాబాద్‌లో వ్యాపారి ఇంట్లో భారీ చోరీ.. 50 తులాల బంగారం ఎత్తుకెత్తిన దొంగలు


హైదరాబాద్‌లో ఓ వ్యాపారి ఇంట్లో భారీ చోరీ జ‌రిగిన ఘటన ఈరోజు వెలుగులోకొచ్చింది. ఓల్డ్‌ బోయిన్ ప‌ల్లిలోని క‌ళింగ బ‌హుళ అంత‌స్తు భ‌వ‌నంలో నివాసం ఉంటోన్న బంగారం వ్యాపారి రాజేశ్‌కుమార్‌ ఇంట్లోకి ప్ర‌వేశించిన దొంగ‌లు 50 తులాల బంగారాన్ని చోరీ చేశారు. ఇంటి తాళాలు ప‌గులగొట్టి దొంగ‌లు చోరీకి పాల్పడ్డారు. ఓ ఫంక్ష‌న్‌లో పాల్గొన‌డానికి వ్యాపారి కుటుంబం రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి వెళ్లింది. ఈ స‌మ‌యంలో దొంగలు చోరీకి పాల్ప‌డ్డారు. ఈరోజు విషయాన్ని గమనించిన బాధితులు బోయిన్ ప‌ల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు న‌మోదు చేసుకుని, ద‌ర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News