: తీర్థయాత్రలకని వెళ్లిన కేరళ ముస్లిం యువకులు..ఐఎస్ లో చేరినట్లు అనుమానం!
గత నెల 6వ తేదీన తీర్థయాత్రలకు వెళుతున్నామంటూ తమ కుటుంబసభ్యులకు చెప్పి వెళ్లిన కేరళ ముస్లిం యువకులు 16 మంది ఇంతవరకూ తిరిగి రాలేదు. అయితే, తమ గమ్యస్థానానికి చేరామంటూ ఆ యువకుల్లో ఒకరు తమ బంధువుకు వాట్సాప్ మెస్సేజ్ పంపారు. కనపడకుండా పోయిన ఆ యువకులు ఐఎస్ లో చేరేందుకని సిరియా లేదా ఇరాక్ వెళ్లి ఉంటారని యువకుల బంధువులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని వారు కోరుతున్నారు. అయితే, ఈ విషయమై కేరళ పోలీస్ అధికారులు మాట్లాడుతూ, అదృశ్యమైన యువకుల విషయమై వారి తల్లిదండ్రులు నోరుమెదపట్లేదని, దీంతో, చట్టపరమైన చర్యలు తీసుకోలేకపోతున్నామని చెప్పారు. సుమారు 36 మంది యువకులు ఉగ్రవాదుల్లో చేరినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలిపారు.