: తిరిగి రాజేంద్రనగర్ కోర్టుకే వెళ్లండన్న ఫ‌్యామిలీ కోర్టు.. తేలని చిన్నారి సానియా భవితవ్యం
ఐదు రోజుల క్రితం భర్త రూపేశ్ చేతిలో దారుణంగా హత్యకు గురయిన కాంగో దేశస్థురాలు సింథియా కుమార్తె సానియా భవితవ్యం గురించి ఎటూ తేలడం లేదు. ఎవరి సంరక్షణలో పెరగాలన్న అంశంపై చిన్నారి సానియాను ఎల్బీనగర్‌లోని ఫ్యామిలీ కోర్టుకి తీసుకెళ్లాలని, ఫ్యామిలీ కోర్టే ఈ అంశాన్ని తేలుస్తుందని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దాంతో శిశుసంరక్షణ కేంద్రంలో ఉంటోన్న సానియాను ఎల్బీనగర్‌లోని ఫ్యామిలీ కోర్టులో హాజరు పరిచారు. అయితే ఫ్యామిలీ కోర్టు మళ్లీ రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి కోర్టుకే వెళ్లాలని సూచించింది. దీంతో సానియా సంరక్షణ బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారన్న అంశంపై సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. కాంగో నుంచి వచ్చిన సింథియా కుటుంబ సభ్యులు, రూపేశ్ కుటుంబ సభ్యులు ఎవరికి వారు సానియాని తమకే అప్పగించాలని వాదిస్తున్న సంగతి తెలిసిందే.