: చంద్రబాబు రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారు...కమీషన్ చిత్తశుద్ధిపై నమ్మకం లేదు: బీసీ సంఘాల నేతలు


రిజర్వేషన్లకు నిర్వచనాన్ని ఇస్తూ రాజ్యాంగం స్పష్టమైన వివరణలతో అర్టికళ్లను రూపొందించిందని బీసీ సంఘాల నేతలు పేర్కొన్నారు. విజయవాడలో కాపులను బీసీల్లో చేర్చరాదంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించిన సందర్భంగా వారు మాట్లాడుతూ, రిజర్వేషన్ల విషయంలో సామాజిక వెనుకబాటుతనం అన్నదే విద్యావకాశాల కల్పన, ఉద్యోగ కల్పనకు గీటురాయి అని రాజ్యాంగం స్పష్టంగా పేర్కొందని అన్నారు. ఆర్థికపరమైన వెనుకబాటుతనాన్ని పరిగణనలోకి తీసుకోవాలని రాజ్యాంగం ఎక్కడా చెప్పలేదని, అలా ఎవరైనా ప్రయత్నిస్తే రాజ్యాంగ స్పూర్తిని దెబ్బతీసినట్టేనని వారు పేర్కొన్నారు. కాపులను బీసీలలో చేర్చడంపై అధ్యయనం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంజునాథ కమీషన్ చిత్తశుద్ధిపై తమకు సందేహాలు ఉన్నాయని వారు ఆరోపించారు. ఆరు నెలల్లో సాంకేతిక అంశాలను పరిష్కరించి కాపులకు రిజర్వేషన్లు కల్పిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారని వారు గుర్తు చేశారు. ఈ లెక్కన మంజునాథ కమీషన్ ఇచ్చే నివేదిక ఎలా ఉండబోతోందో తాము అంచనా వేయగలమని వారు పేర్కొన్నారు. కాపులకు ఏ ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇస్తారని వారు ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో వ్యవహరిస్తున్న విధానం సరికాదని ఆయన స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News