: అరవై ఏళ్లు పైబడిన ట్రాన్స్ జెండర్లకు శుభవార్త


అరవై సంవత్సరాలు పైబడిన ట్రాన్స్ జెండర్లకు పెన్షన్ సౌకర్యం కల్పించనున్న మొట్టమొదటి రాష్ట్రంగా కేరళ రికార్డుల్లోకి ఎక్కనుంది. ఈ ఏడాది నుంచే వారికి పెన్షన్ ఇవ్వనున్నట్లు కేరళ ఆర్థిక మంత్రి టీఎస్ థామస్ ఇస్సాక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ట్రాన్స్ జెండర్లు సహా అన్ని వర్గాల ప్రజల సంక్షేమం గురించిన బాధ్యత తమ ప్రభుత్వంపై ఉందని అన్నారు. కాగా, కేరళ రాష్ట్రంలో సుమారు 25 వేల మందికి పైగా ట్రాన్స్ జెండర్లు ఉన్నట్లు సమాచారం.

  • Loading...

More Telugu News