: 2019 ఎన్నికలే లక్ష్యం.. ఢిల్లీలో తెలంగాణ బీజేపీ కోర్‌కమిటీ భేటీ ప్రారంభం
తెలుగు రాష్ట్రాల్లో పార్టీ పనిచేస్తోన్న తీరు, బలోపేతం అంశాలపై ఈరోజు ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా ఆధ్వర్యంలో సుదీర్ఘంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఈరోజు మధ్యాహ్నం ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై రాష్ట్ర పార్టీ నేతలతో కలిసి బీజేపీ అధిష్ఠానం చర్చించింది. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కోర్‌కమిటీ భేటీ ప్రారంభమయింది. సమావేశంలో బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో పాటు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు లక్ష్మణ్, పార్టీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు చర్చలు జరుపుతున్నారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా ప్రణాళికలపై నేతలు కీలక చర్చలు జరుపుతున్నారు.