: సీఎం కేసీఆర్ కాన్వాయ్ ను అడ్డుకున్న విద్యార్థులు
నల్గొండ జిల్లా చిట్యాలలో హరితహారం కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊహించని సంఘటన ఎదురైంది. చిట్యాలలో డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతూ విద్యార్థులు సీఎం కాన్వాయ్ ను అడ్డుకుని ఆందోళనకు దిగారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు విద్యార్థులపై స్వల్ప లాఠీఛార్జి చేశారు. సుమారు 20 మంది విద్యార్థులను అరెస్ట్ చేశారు.