: షర్టు విప్పేసి మరీ వాలీబాల్ ఆడిన కోహ్లీ!


టెస్టు సిరీస్ ఆడేందుకు వెస్టిండీస్ వెళ్లిన టీమిండియా ప్రస్తుతం సరదాగా గడుపుతోంది. మ్యాచ్ సన్నాహకాల్లో భాగంగా ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ లో ఫుట్ బాల్ ఆడటం పరిపాటి. కానీ, ఇక్కడి బీచ్ అందాలను ఆస్వాదిస్తున్న టీమిండియా ఆటగాళ్లు వాలీబాల్ ఆడుతూ హుషారుగా కనిపించారు. కెప్టెన్ కోహ్లీ తన షర్ట్ విప్పేసి మరీ బాల్ ను కొడుతున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తున్నాయి. కాగా, కరేబియన్ గడ్డపై దిగిన మర్నాడు టీమిండియా ఆటగాళ్లు ప్రకృతి అందాలను చూడగా, రెండోరోజు.. బీచ్ లో వాలీబాల్ ఆడారు.

  • Loading...

More Telugu News