: మరుగుదొడ్డి కట్టించని భర్తను వద్దంటున్న భార్య


మరుగుదొడ్డి కట్టించని తన భర్తతో కాపురం చేసే ప్రసక్తే లేదని తనకు విడాకులు ఇప్పించాలంటూ ఏడాది క్రితం వివాహం చేసుకున్న అర్చనా గౌతమ్ పంచాయతీ పెద్దలను కోరింది. బీహార్ లోని పశ్చిమ చంపారన్ జిల్లా కొతవా గ్రామానికి చెందిన ఆమె గత మేలో బబ్లూ కుమార్ ను వివాహం చేసుకుంది. తమ ఇంట్లో మరుగుదొడ్డి లేకపోవడంతో బహిరంగ మల విసర్జనకు వెళ్లాల్సి రావడం చాలా ఇబ్బందిగా ఉండటమే కాకుండా, సదరు భూమి యజమాని తనను పలుమార్లు అవమానించాడంటూ పంచాయతీ పెద్దల ముందు ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది. మరుగుదొడ్డి నిర్మించాలని తన భర్తతో ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని చెప్పిన అర్చనా గౌతమ్, తనకు విడాకులిప్పించాలని పంచాయతీ పెద్దలను కోరింది.

  • Loading...

More Telugu News