: విజయవాడలో బీసీ ఐక్యవేదిక భారీ ర్యాలీ... ఉద్రిక్తత
ఆంధ్రప్రదేశ్‌లో కాపులకు రిజర్వేషన్ల కల్పనపై అధ్యయనం చేసి సమగ్ర నివేదిక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజునాథ కమిషన్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మంజునాథ కమిషన్ విజయవాడలో పర్యటిస్తోంది. అయితే పలు విన్నతులను మంజునాథ కమిషన్‌కు విన్నవించుకోవాలని బీసీ ఐక్యవేదిక ఈరోజు భారీ ర్యాలీ నిర్వహించింది. మంజునాథ కమిటీని కలిసేందుకు బీసీ ఐక్యవేదిక కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. కమిషన్ సభ్యులు బసచేస్తోన్న భవనం వద్దకు చేరుకున్నారు. మంజునాథ కమిషన్‌ను కలవడానికి కొందరు బీసీ నాయకులను మాత్రమే అనుమతిస్తామని పోలీసులు చెప్పారు. అందరం కలిసే మంజునాథ కమిషన్ తో మాట్లాడుతామని కార్యకర్తలు పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బీసీ ఐక్యవేదిక కార్యకర్తలు పోలీసులపై మండిపడుతున్నారు.