: మొజాంబిక్ టు దక్షిణాఫ్రికా... మోదీ బిజీబిజీ!


ఐదు రోజుల విదేశీ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, రెండో రోజు దక్షిణాఫ్రికాలో బిజీగా గడుపుతున్నారు. ఈ ఉదయం మొజాంబిక్ నుంచి దక్షిణాఫ్రికా చేరుకున్న మోదీకి అక్కడి అధికారులు, ప్రవాస భారతీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ప్రిటోరియా యూనియన్ భవన సముదాయంలో మోదీ గౌరవార్థం ఓ సమావేశం జరిగింది. దానిలో పాల్గొన్న ఆయన, ఇండియాకు ఉన్న అత్యంత మిత్రదేశాల్లో దక్షిణాఫ్రికా ఒకటని అభివర్ణించారు. ఈ దేశానికి, భారత స్వాతంత్ర సంగ్రామానికి సంబంధముందని తెలిపారు. అనంతరం మోదీ దేశాధ్యక్షుడు జాకబ్ జుమాతో భేటీ అయ్యారు. ద్వైపాక్షిక, ఆర్థిక సంబంధాలపై జుమాతో ప్రత్యేక చర్చలు జరిపారు. సాయంత్రం పలువురు పారిశ్రామికవేత్తలు, వ్యాపారులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమై, ఇండియాలో పెట్టుబడులు పెట్టాలని కోరనున్నారు. భారత్ లో వ్యాపార అవకాశాలు, మౌలిక వసతుల కల్పనపై వారికి ప్రభుత్వ ఉద్దేశాలను, లక్ష్యాలను వివరించనున్నారు.

  • Loading...

More Telugu News