: అమెరికా డల్లాస్‌లో కొనసాగుతోన్న ఉద్రిక్తత.. డల్లాస్‌కు విమాన రాకపోకలపై ఆంక్షలు
అమెరికాలో నల్లజాతీయులపై పోలీసుల కాల్పులకు నిరసనగా చేపట్టిన ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆందోళనకారులను అదుపు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఆందోళనకారులు జరిపిన కాల్పులలో నలుగురు పోలీసులు మరణించిన సంగతి తెలిసిందే. మరో ఏడుగురికి కాల్పుల్లో తీవ్రగాయాలయ్యాయి. పోలీసులే లక్ష్యంగా ఆందోళన కారులు కాల్పులు జరిపినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. కాల్పులకు పాల్పడిన వారిలో ఇప్పటి వరకు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు పేర్కొన్నారు. కాగా, నిరసన ప్రదర్శనలో బాంబులు పెట్టినట్లుగా తమకు సమాచారం వచ్చిందని అక్కడి అధికారులు తెలిపారు. దీంతో డల్లాస్‌కు విమాన రాకపోకలపై ఆంక్షలు విధించారు.