: దుబాయ్ లో రూ. 2.20కే సౌరవిద్యుత్... ఇండియాలో అదే ధర మాత్రం అసాధ్యమట!


గత నెలలో అత్యధిక దేశాలకు సాధ్యం కాని రీతిలో 800 మెగావాట్ల భారీ సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించిన దుబాయ్, యూనిట్ విద్యుత్ ను 2.99 సెంట్ల (రూ. 2.20) ధరకు అందించేందుకు నిర్ణయించింది. ఇదే సమయంలో సౌర విద్యుత్ పై కన్నేసిన భారత్ లో ఇంత తక్కువ ధర అసాధ్యమని నిపుణులు వ్యాఖ్యానించారు. ఇండియాలో ప్రస్తుతమున్న టెక్నాలజీ అందుకు సహకరించదని, దీనికితోడు వాతావరణ పరిస్థితులు సైతం ఆ ధరకు విద్యుత్ లభించేందుకు తోడ్పడబోవని అంటున్నారు. దుబాయ్ లో ఉన్న ఎండ తీవ్రత ఇండియాలో ఉండకపోవడం, యూనిట్ విద్యుత్ తయారయ్యేందుకు దుబాయ్ తో పోలిస్తే అధిక సమయం పట్టడం ఇందుకు ప్రధాన కారణమని తెలుస్తోంది. గత జనవరిలో ఫిన్ ల్యాండ్ కంపెనీ ఫోర్టమ్ ఎనర్జీ రాజస్థాన్ లో 70 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంటును ప్రారంభించగా, యూనిట్ కు రూ. 4.34 ధర కోట్ అయ్యింది. కొంతమేరకు అధునాతన సాంకేతికత నిండిన సోలార్ ప్యానళ్లు అందుబాటులోకి వస్తే, ఈ ధర ఇంకొంచెం తగ్గుతుందే తప్ప రూ. 2.20 స్థాయికి రాబోదని రిన్యూవబుల్ ఎనర్జీ కాలేజ్ చైర్మన్ ఎస్పీ గాన్ చౌదరి వ్యాఖ్యానించారు. దుబాయ్ లో 1 మిలియన్ మెగావాట్ సౌలార్ ప్లాంటు నుంచి 20 లక్షల యూనిట్ల విద్యుత్ వస్తుందని, ఇండియాలో అది 16 లక్షల యూనిట్లకు మాత్రమే పరిమితమని ఆయన గుర్తు చేశారు. ఇండియాలో రుణాలపై అధిక వడ్డీ రేట్లు, స్థల సేకరణ తదితరాలు కూడా సౌర విద్యుత్ రంగానికి అడ్డంకులని వివరించారు.

  • Loading...

More Telugu News