: కోతి అంటే 'అంజన్న' కాబట్టి మనం చంపం.. అవేమో హంగామా చేస్తున్నాయి: తెలంగాణ సీఎం కేసీఆర్


న‌ల్ల‌గొండ జిల్లాలో కోతులు ప్ర‌జల్లోకి వ‌చ్చి నానా హంగామా సృష్టిస్తున్నాయ‌ని త‌మకు ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. నల్గొండ జిల్లా గుండ్రాంపల్లిలో హరితహారంలో భాగంగా మొక్కను నాటిన ఆయన అనంతరం మాట్లాడుతూ.. ‘కోతి అంటే అంజన్న కాబట్టి మనం వాటిని చంపం.. అవేమో హంగామా చేస్తున్నాయి..’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘కోతులు మ‌న ద‌గ్గ‌ర‌కు ఎందుకు వ‌స్తున్నాయి..? మ‌నం కోతుల జాగను పొల్లుపొల్లు చేసినం కాబట్టి.. అవి మనల్ని పొల్లుపొల్లు చేస్తున్నాయి..’ అని ఆయ‌న పేర్కొన్నారు. రెండు వారాల పాటు 24 గంటలు మ‌న‌కు చెట్లు పంచ‌డ‌మే ప‌ని కావాల‌ని కేసీఆర్ అన్నారు. అడ‌వుల శాతాన్ని పెంచితే మ‌ళ్లీ కోతులు అక్క‌డ‌కు వెళ్లిపోతాయ‌ని ఆయ‌న సూచించారు. చెట్టును పెంచడమంటే మనల్ని మనం బాగు చేసుకోవడమేన‌ని ఆయ‌న అన్నారు. ‘వానలు వాపస్ రావాలె.. కోతులు వాపస్ పోవాలె’ అని ఆయ‌న వ్యాఖ్యానించారు. ‘ప్రతీ పాఠశాల ఆకుప‌చ్చ ఒడి కావాలె’ అని ఆయ‌న ఆకాంక్షించారు. ‘అడ్డగోలుగా వనాలని నాశనం చేసినందుకే మనకు వానలు లేకుండా పోతున్నాయి’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

  • Loading...

More Telugu News