: దేశంలో భారీ పేలుళ్లకు ఉగ్రవాదుల కుట్ర.. నిఘా సంస్థల హెచ్చరిక


ప్రపంచ వ్యాప్తంగా దాడులతో రెచ్చిపోతోన్న ఉగ్ర‌సంస్థ‌లు భార‌త్‌లోనూ దాడి చేయడానికి ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తున్నాయ‌ని కేంద్ర నిఘా సంస్థ‌లు ఈరోజు తెలిపాయి. దేశంలో భారీ పేలుళ్ల‌కు ఉగ్ర‌వాదులు కుట్ర ప‌న్నార‌ని చెప్పాయి. రాష్ట్రాల‌న్నీ అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని నిఘా సంస్థ‌ల అధికారులు హెచ్చ‌రించారు. ఇటీవల ఐఎస్ఐఎస్ సాయంతో హైద‌రాబాద్ లో పేలుళ్ల కోసం ప్ర‌య‌త్నాలు జ‌రుపుతోన్న ఉగ్ర‌వాదులు ప‌ట్టుబ‌డ్డ విష‌యం తెలిసిందే. నిఘా సంస్థ ఇచ్చిన స‌మాచారంతోనే వారిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈసారి ఉగ్ర సంస్థ‌ ఆల్‌ఖైదా భార‌త్‌లో దాడుల కోసం ప్ర‌ణాళిక సిద్ధం చేసుకున్న‌ట్లు త‌మ‌కు తెలిసింద‌ని నిఘా సంస్థ‌ల అధికారులు పేర్కొన్నారు. దేశంలో భారీ పేలుళ్లే లక్ష్యంగా ఆల్‌ఖైదా కుట్ర ప‌న్నింద‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News