: గ్లోబల్ వార్మింగ్ ప్రభావం ప్రధానంగా మనపైనే ఉంది: కేటీఆర్
హరితహారం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని ఇది ప్రజా కార్యక్రమం అని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈరోజు హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అడవుల శాతం పెంచి, ఆకు పచ్చని రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడానికి చేపట్టిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రజలందరూ బాధ్యతగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ‘తెలంగాణ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ, భగీరథ లాంటి పథకాలు మంచి ఫలితాలను రాబడుతున్నాయి. అలాగే హరితహారం కూడా మంచి ఫలితాలనిస్తుంది’ అని ఆయన అన్నారు. ‘గ్లోబల్ వార్మింగ్ ప్రభావం మనపైనే ప్రధానంగా ఉంది’ అని ఆయన అన్నారు. హరితహారం కార్యక్రమంతో దాన్ని ఎదుర్కోవచ్చని పేర్కొన్నారు.