: ఉగ్రవాదులకు రంజాన్ బొనాంజా... షీర్ కుర్మా, బిర్యానీ, ఖీర్!
హైదరాబాద్ లో ఎన్ఐఏ అరెస్ట్ చేసిన ఉగ్రవాద బృందానికి పోలీసులు రంజాన్ విందు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న వీరంతా విచారణకు సహకరిస్తున్న నేపథ్యంలో ఈద్ నాడు విచారణకు బ్రేక్ ఇచ్చి వారికి కుటుంబ సభ్యులను కలసుకునే వీలు కల్పించారు. వారు కోరిన ఖీర్, బిర్యానీ, షీర్ కుర్మా వంటివి అందించారు. ఇక ఈ నిందితులతో ఆన్ లైన్లో సంప్రదింపులు జరిపిన వారు ఎవరన్న విషయాన్ని నిర్థారించుకోవడంపై ఎన్ఐఏ అధికారులు దృష్టిని సారించారు. తమతో మాట్లాడిన వ్యక్తి పేరు యూసుఫ్ అల్ హింద్ అని మాత్రమే వీరంతా చెబుతున్నారు. గత ఆరు నెలల్లో పలుమార్లు అల్ హింద్ తో, ఐదు సార్లు ఐఎస్ఐఎస్ చీఫ్ గా చెప్పుకున్న అబూ బకర్ అల్ బాగ్దాదీతో తాను మాట్లాడినట్టు ఇబ్రహీం వెల్లడించినట్టు తెలుస్తోంది. ఇక పోలీసులకు పట్టుబడినప్పటికీ, ఇబ్రహీంలో ఎంతమాత్రమూ పశ్చాత్తాపం కనిపించక పోగా, తాము చేసింది తప్పు కాదని పోలీసుల వద్ద ఇబ్రహీం వాదించినట్టు తెలుస్తోంది. వీరి కస్టడీ గడువు ముగింపు దశకు వస్తుండటంతో నేటి నుంచి మరింత వేగంగా విచారణ జరపాలని ఎన్ఐఏ భావిస్తోంది.