: అత్యాచారం కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి జీవిత ఖైదు


బాలికలపై అత్యాచారం కేసులో 80 ఏళ్ల వృద్ధుడికి మద్రాస్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. జీవిత ఖైదును ఆపాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టేసిన కోర్టు రీ హియరింగ్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లేందుకు కూడా నిరాకరించింది. ఆరేళ్ల క్రితం మార్చి 1, 2010న 74 ఏళ్ల సోమసుందరం 10, 11, 12 సంవత్సరాలున్న బాలికలను నమ్మించి తనతోపాటు తీసుకెళ్లాడు. వారికి నీలి చిత్రాలు చూపించి ఒకరి తర్వాత ఒకరిపై అత్యాచారానికి పాల్పడినట్టు ప్రాసిక్యూషన్ పేర్కొంది. ఈ విషయం ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వారిని భయపెట్టాడు. కేసును విచారించిన న్యాయ స్థానం వృద్ధుడిని దోషిగా తేల్చి యావజ్జీవ కారాగార శిక్ష విధించింది.

  • Loading...

More Telugu News