: బాగ్దాద్ పై విరుచుకుపడ్డ ఐఎస్!...36 మంది దుర్మరణం, 50 మందికి పైగా గాయాలు!
ముష్కర మూక ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) మరోమారు పేట్రేగిపోయింది. ఇరాక్ రాజధాని బాగ్దాద్ కేంద్రంగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత వరుస ఆత్మాహుతి దాడులకు పాల్పడింది. ఈ దాడిలో 36 మంది చనిపోగా, 50 మందికి పైగా గాయాలయ్యాయి. నగరంలోని ఓ ప్రార్థనా మందిరం కేంద్రంగా ఐఎస్ ఈ దుర్మార్గానికి పాల్పడింది. ఢాకాలో నిన్న చేసిన దాడి తరహాలోనే పోలీసులే లక్ష్యంగా ఐఎస్ ఉగ్రవాదులు బాగ్దాద్ లో పేట్రేగిపోయారు. దాడుల్లో గాయపడ్డ వానిని భద్రతా దళాలు సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. ఈద్ ఉల్ ఫితర్ ముగిసిన మరుక్షణమే జరిగిన ఈ దాడి బాగ్దాద్ లో భయానక వాతావరణాన్ని నెలకొల్పింది. ఈ దాడికి పాల్పడింది తామేనని ఐఎస్ ముష్కరులు నిస్సిగ్గుగా ప్రకటించుకున్నారు.