: వాళ్లిద్దరూ నాకంటే పెద్ద స్టార్లు: షారూఖ్ ఖాన్


బాలీవుడ్ లో అమితాబ్ తరువాత సూపర్ స్టార్ డమ్ సంపాదించుకున్న అగ్రనటులెవరంటే షారూఖ్, సల్మాన్, ఆమిర్ ఖాన్ ల పేర్లు వినిపిస్తాయి. ఈ ముగ్గురూ తమదైన శైలిలో బాలీవుడ్ లో తిరుగులేని పేరు ప్రఖ్యాతులు సంపాదించారు. తాజాగా స్టార్ డమ్ పై అమీర్ ఖాన్ మాట్లాడుతూ, తన కంటే సల్మాన్, షారూఖ్ ఖాన్ లు పెద్ద స్టార్లు అన్నాడు. దీనిపై షారూఖ్ స్పందించాడు. 'మా మధ్య మంచి సంబంధాలున్నాయి. మేం ముగ్గురం చాలా ప్రేమగా ఉంటాం. నా కంటే సల్మాన్, ఆమిర్ పెద్ద స్టార్లని నేను భావిస్తున్నాను. ఆమిర్ చేసిన కామెంట్స్ మేము పరస్పరం గౌరవించుకుంటామని నిరూపించాయి. మా ముగ్గురిలో ఎవరే సినిమా చేసినా పరస్పరం అభినందించుకుంటామ'ని షారూఖ్ పేర్కొన్నాడు.

  • Loading...

More Telugu News